జేమిస‌న్‌కు 5 వికెట్లు.. ఇండియా 242 ఆలౌట్‌

 న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 242 ర‌న్స్‌కు ఆలౌటైంది.  తొలి టెస్టు త‌ర‌హాలోనే కివీస్ బౌల‌ర్ల ధాటికి.. టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలువ‌లేక‌పోయారు.  తొలి రోజు మూడ‌వ సెష‌న్‌లో కేవ‌లం ప‌ది ఓవ‌ర్ల‌లోనే భార‌త్ చివ‌రి అయిదు వికెట్ల‌ను కోల్పోయింది.  కివీస్ బౌల‌ర్ జేమిస‌న్ త‌న ఖాతాలో అయిదు వికెట్ల వేసుకున్నాడు. సౌథీ, బౌల్ట్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  తొలుత టాస్ గెలిచిన కివీస్‌.. భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  ఓపెన‌ర్ పృథ్వీ షా.. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. కానీ కెప్టెన్ కోహ్లీ మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. కోహ్లీ కేవ‌లం మూడు ర‌న్స్ చేసి  నిష్క్ర‌మించాడు.  భార‌త ప్లేయ‌ర్ల‌లో పుజారా, విహారీలు అర్థ సెంచ‌రీలు చేశారు.  పుజారా 54 ర‌న్స్ చేయ‌గా, విహారీ 55 ర‌న్స్ చేసి ఔట‌య్యారు. ప‌దో వికెట్ కోసం ష‌మీ, బుమ్రాలు 26 ర‌న్స్ జోడించ‌డం విశేషం.