అమెరికా, తాలిబన్ మధ్య ఇవాళ శాంతి ఒప్పందం జరగనున్నది. ఈ ఈవెంట్‌కు భారత్ హాజరుకానున్నది. ఖతార్‌లోని దోహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఒప్పందంతో.. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న వేలాది మంది అమెరికా సైనికులు ఉపసంహరించుకోనున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌లో దశాబ్ధాలుగా ఉన్న హింసాత్మక వాతావరణానికి బ్రేక్ పడనున్నది. అమెరికా, తాలిబన్ మధ్య జరుగుతున్న శాంతి ఒప్పందానికి ఆఫ్ఘన్ దూరంగా ఉంటున్నది. ప్రస్తుతం ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. అయితే తాలిబన్‌తో అమెరికా ఎటువంటి ఒప్పందానికి అంగీకరించిందో ఇంకా స్పష్టంగా తెలియదు. ఆ డీల్‌లో ఉన్న షరతుల గురించి ఎటువంటి పబ్లిక్ ప్రకటన జరగలేదు. దోహాలో జరిగే సంతకాల ఒప్పందానికి ఆఫ్ఘనిస్తాన్ హాజరుకావడం లేదు. సుమారు 30 దేశాల ప్రతినిధులు సంతకాల ఒప్పందానికి హాజరుకానున్నారు.
భారత్ సమక్షంలో.. తాలిబన్‌తో అమెరికా శాంతి ఒప్పందం..