దేశంలో 24 గంటల వ్యవధిలో కరోనాతో 51 మంది మరణించారు. కొత్తగా 1594 పాజిటివ్ కేసులు నమోదవడంతో మంగళవారం సాయంత్రానికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 29,974కి చేరింది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 7027కు పెరగగా..ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 937కు చేరింది. ప్రస్తుతం 22010 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్ర(8590), గుజరాత్(3548), ఢిల్లీ(3108), మధ్యప్రదేశ్(2368), రాజస్థాన్(2262) రాష్ట్రాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
భారత్‌లో 24 గంటల్లో 51 మంది మృతి